Teenmar Mallanna | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం శాసనమండలిలో విద్యపై చర్చ సందర్భంగా తీర్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఏవీఎన్రెడ్డి విద్యాసంస్థలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి మాట్లాడుతూ.. తాను విద్యాశాఖ నిబంధనల ప్రకారమే ఫీజులు నిర్ణయించానని తనపై ఆరోపణలు చేయడం తగదని మండలి దృష్టికి తెచ్చారు. ఇంతలో తీన్మార్ మల్లన్న జోక్యం చేసుకోగా సస్పెండ్ చేయాల్సి వస్తుందని చైర్మన్ అగ్రహం వ్యక్తం చేశారు.