హైదరాబా ద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా పాఠశాల భవనాల మరమ్మతులు చేసిన కా ంట్రాక్టర్లకు బిల్లులు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు లేఖ రాశారు.
మండలి లో మంగళవారం కాంట్రాక్టర్లు గుత్తాను కలిసి పెండింగ్లో ఉన్న బిల్లులను ప్రభుత్వం త్వరగా విడుదల చేసేందుకు సహాయం చేయాలని కో రుతూ వినతిపత్రం అందజేశారు. సుఖేందర్రెడ్డి సానుకూలంగా స్పందించి, భట్టివిక్రమారతో ఫోన్లో మాట్లాడి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. బిల్లులు రాకపోవడంతో చిన్న కాంట్రాక్టర్లు ఇ బ్బందులు ఎదురొంటున్నారని గుత్తా సుఖేందర్రెడ్డి వివరించారు.