Gurukula Schools | హైదరాబాద్, అక్టోబర్14 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం 9 నెలలుగా అద్దెలు చెల్లించకపోవడం పై రాష్ట్ర గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవనయాజమాన్య సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు బిల్డింగ్‌లకు తాళాలు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, కార్యదర్శి బండి కుమారస్వామి, కోశాధికారి సీహెచ్ కొండల్‌రెడ్డి సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వం బకాయిలన్నింటి నీ చెల్లించిన వెంటనే తాళాలు తీయాలని భవన యజమానులకు పిలుపునిచ్చారు.