గోవిందరావుపేట, ఆగస్టు 11: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆదివారం విద్యార్థి విద్యుత్తు షాక్కు గురయ్యాడు. తాడ్వాయి మండలం బయ్యక్కపేటకు చెందిన నీరటి ముఖేశ్ కర్లపల్లి గురుకులంలో ఆరోతరగతి చదువుతున్నాడు.
మధ్యాహ్న భోజనం తరువాత కిటికీ చువ్వకు కట్టిన విద్యుత్ వైరును తాకడంతో షాక్ తగిలి కింద పడిపోయాడు. అక్కడే ఉన్న ఏఎన్ఎం ఆదిలక్ష్మి 108కు సమాచారం అందించగా, సిబ్బంది ప్రథమ చికిత్స చేసి ములుగు దవాఖానకు తరలించారు.