హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): బదిలీలు, పదోన్నతుల్లో ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలు, ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితులు ఉండటంతో సర్కారుపై ఐక్యంగా పోరుబావుటా ఎగరేయాలని గురుకుల సొసైటీల్లోని సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు 11 సంఘాలు కలిసి గురుకుల విద్యాజేఏసీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. జేఏసీలో టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ అధ్యక్షుడు సీహెచ్ బాలరాజు, స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుదాస్, టీఎస్‌డబ్ల్యూఆర్‌టీయూ బాలస్వామి, ఏటీజీఆర్ఐఈడబ్ల్యూఏ యాదయ్య, ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ చలపతి, టీటీఆర్ఈఐటీఏ రుషికేశ్కుమార్, టీఆర్ఈఐటీఏ గోవర్ధన్‌రెడ్డి, టీఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఝాన్సీరాణి, టీఆర్డీసీఈఏ సాంబలక్ష్మి, టీజీఎస్డబ్ల్యూఆర్ఈటీఎల్ఏ ఆవుల సైదులు, పీడీ అసోసియేషన్ వీ చందర్ భాగస్వాములుగా ఉన్నారు. అంతేకాదు జేఏసీ ఆధ్వర్యంలో తక్షణం పరిష్కరించాల్సిన పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుపెట్టారు.