ప్యారానగర్ అటవీ ప్రాంతంలో డంపింగ్యార్డు ఏర్పాటు వద్దని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఆందోళనలతో గుమ్మడిదల మండలం శనివారం అట్టుడికింది. బాధిత గ్రామాల ప్రజలు, రైతులు, మహిళా సంఘాలు వందల సంఖ్యలో ఆటోలు, ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు తీశారు.
డంపింగ్యార్డు ముట్టడికి వెళ్తుండగా అడుగడుగునా పోలీసులు అడ్డుకోవడంతో మండలవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.