హైదరాబాద్, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): చిట్‌ఫండ్ సంస్థల రుసుములు, ఆదాయంపై ఉన్న 18శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించేలా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాల ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ చిట్‌ఫండ్స్ నేతలు విజ్ఞప్తి చేశారు.
ఈ మేర కు డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార మల్లును గురువారం ప్రజాభవన్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.డిప్యూటీ సీఎం ను కలిసినవారిలో ఫెడరేషన్ చైర్మన్ రాజాజీ, ప్రెసిడెంట్ కే శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ ఎల్ సుమన్, కోశాధికారి ఆర్ రమేశ్ తదితరులు ఉన్నారు.