హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభు త్వం రాజ్యసభలో వెల్లడించింది. గత ప దేండ్లలో దేశవ్యాప్తంగా 1,700 చదరపు కిలోమీటర్ల అటవీ భూమి తగ్గినప్పటికీ తెలంగాణలో 647 చ.కి.మీ. పచ్చదనం పెరిగినట్టు ప్రకటించింది. 2015 జూలైలో ప్రా రంభమైన హరితహారంలో భాగంగా 9 వి డతల్లో మొత్తం 273.33 కోట్ల మొక్కలను నాటారు. ఇందుకోసం ప్రభుత్వం తొమ్మిదేండ్లలో దాదాపు రూ.10,822 కోట్లు ఖ ర్చు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14,864 న ర్సరీలు, 13,657 ఎకరాల్లో 19,472 పల్లె ప్రకృతి వనాలు, 6,298 ఎకరాల్లో 2,011 బృహత్ ప్రకృతి వనాలు, 1,00,691 కి. మీ. రహదారి వనాలు ఏర్పాటు చేసింది.
అటవీ విస్తీర్ణాన్ని పెంచుకున్న మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2019- 2021 మధ్య అటవీ విస్తీర్ణం ఎక్కువగా పెరిగిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ (647 చ.కి.మీ.), తె లంగాణ (632 చ.కి.మీ.), ఒడిశా (537 చ.కి.మీ.) వరుస స్థానాల్లో నిలిచాయి.
భారత్‌లో గత దశా బ్ద కాలంగా 1,700 చ.కి.మీ. అటవీ భూ మి తగ్గినప్పటికీ తెలంగాణలో పచ్చదనం గ ణనీయంగా పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమం విజయవంతమైందనడానికి ఇదే నిదర్శనం. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆశిస్తున్నా.