హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): వచ్చేనెల మొదటివారంలో గ్రూప్-4 ప్రాథమిక కీని విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. ఆ తర్వాత సుమారు వారంరోజుల పాటు అభ్యంతరాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నది. అభ్యంతరాలపై నిపుణుల కమిటీతో కమిషన్ సమావేశం అవుతుంది. తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఆగస్టు నెలలోనే పూర్తి చేయాలని సంస్థ భావిస్తున్నది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో తుది ఫలితాలు ఇవ్వాలని యోచిస్తున్నది. గురువారంతోనే ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవడంతో ఇతర ప్రక్రియను వేగవంతం చేయనున్నది. రోజుకు 35 వేల నుంచి 45 వేల మంది ఓఎంఆర్ షీట్లను స్కానింగ్ చేశారు. దీంతో కేవలం 20 రోజుల్లోనే 7,62,872 మంది ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ పూర్తయింది.