గ్రూప్ -2 ఫలితాలు విడుదల
అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆదివారం ఈ ఫలితాలను విడుదల చేశారు.
- 782 ఉద్యోగాలతో తుది జాబితా
- 18 రకాల ఉద్యోగాల భర్తీ
- దసరాలోపే నియామక పత్రాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆదివారం ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 783 పోస్టులకు 782 మంది అభ్యర్థులు ఉద్యోగాలను సాధించారు. మెడికల్ రిపోర్ట్ అందని కారణంగా ఒక పోస్టు భర్తీని విత్‌హెల్డ్‌లో ఉంచారు. గ్రూప్-2లో భాగంగా మొత్తం 18 రకాల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేశారు. పూర్తి వివరాల కోసం https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని, పరీక్షలు నిర్వహించిన 10 నెలల్లోనే ఫలితాలు వెల్లడించామని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. విజేతలకు దసరాలోపే నియామకపత్రాలను అందజేయాలని సర్కారు వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్-1 విజేతలకు నియామక పత్రాలను అందజేయగా, గ్రూప్ -2 విజేతలకు సైతం అక్టోబర్ 2న దసరాలోపే శాఖల వారీగా నియామక ప త్రాలిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కేసీఆర్ హయాంలో
గ్రూప్-2 పోస్టుల భర్తీకి గత కేసీఆర్ సర్కారు హయాంలోనే నోటిఫికేషన్ విడుదలైంది. 2022లో 783 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్షలు వాయిదా పడ్డాయి. 2024 డిసెంబర్లో రాత పరీక్షలను నిర్వహించారు. 2025 మార్చిలో జనరల్ ర్యాకింగ్ లిస్టును విడుదల చేశారు. మొత్తం 5,51,855 మంది గ్రూప్-2కు దరఖాస్తు చేయగా, 2,49,964 మంది అభ్యర్థులు పరీక్షలను రాశారు. వారి లో 13,316 మందిని అనర్హులుగా ప్రకటించారు. 2,36,649 మంది అభ్యర్థులతో జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేశారు. ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించి, తాజాగా తుది ఫలితాలను విడుదల చేశారు.
పురుష టాపర్లు మహిళా టాపర్లు

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

