Group-2 | హైదరాబాద్ : బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియాతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై గ్రూప్-2 అభ్యర్థి సింధు ఘాటుగా స్పందించారు. ఎన్నికల ముందు మా నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కోసం ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పెయిడ్ ఆర్టిస్ట్ అని ట్రోలింగ్ చేస్తారా..? అని మండిపడ్డారు.
తీన్మార్ మల్లన్న నన్ను శంకిని అని మాట్లాడుతున్నాడు.. నేను ఇదే నిరుద్యోగులు, టీఎస్పీఎస్సీ సమస్యల మీద గత ప్రభుత్వం ఉన్నపుడు కూడా వచ్చి మాట్లాడాను.. ఆ రోజు నేను శంకిని లాగా కనపడలేదా.? అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొట్లాడినం. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నన్ను కొన్నారా..? అప్పుడు నన్ను ఎందుకు పెయిడ్ ఆర్టిస్ట్ అనలేదు అని సూటిగా ఆమె అడిగారు.
నేను పెయిడ్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు నేను ఏ పార్టీ కండువా అయినా కప్పుకున్నట్లు ఎవరైనా నిరుపించగలరా..? ఒక ఆడ బిడ్డను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్ చేయడం ఎంతవరకు సమంజసం.? అని ప్రశ్నించారు. ఆ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు మేము ఎక్కడుంటే అక్కడిక వచ్చి మమ్మల్ని నమ్మండి అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మంచిగా చేస్తాం అని నమ్మబలికి ఓట్లు వేయించుకొని మోసం చేశారు. ఆ రోజు ఏఐసీసీ నేతలను కలిశాం. ప్రొఫెసర్ కోదండరాం, రియాజ్ చెప్పిన ప్రకారమే చేసినం.. అప్పుడు మమ్మల్ని ఎందుకు పెయిడ్ ఆర్టిస్ట్ అనలేదు అని కాంగ్రెస్ నేతలపై సింధు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబానికి ఏదైనా జరిగితే తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సింధు డిమాండ్ చేశారు.
పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా పై ఘాటుగా స్పందించిన గ్రూప్ 2 అభ్యర్థి సింధు
ఎన్నికల ముందు మా నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కోసం ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పెయిడ్ ఆర్టిస్ట్ అని ట్రోలింగ్ చేస్తారా.… pic.twitter.com/hnRNDsutwe
— Telugu Scribe (@TeluguScribe) July 6, 2024