హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) జూన్ 11న నిర్వహించ తలపెట్టిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. వివిధ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసినప్పుడు సంబంధిత పరీక్షల మధ్య 2 నెలల వ్యవధి ఉండాలన్న నిబంధనను అమలు చేయకుండా గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధమని 36 మంది అభ్యర్థులు ఆ పిటిషన్లో పేరొన్నారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శితోపాటు టీఎస్పీఎస్సీ చైర్మన్,కార్యదర్శి, హైదరాబాద్ సిటీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (క్రైం) అడిషనల్ కమిషనర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం విచారణ జరుపనున్నారు.