హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమినరీకి సర్వం సిద్ధమైంది. 503 గ్రూప్-1 ఉద్యోగాలకు ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 3,80,081 మంది పరీక్ష రాస్తున్నారు. 33 జిల్లా కేంద్రాల్లో 994 సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నారు. నిరుడు అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రాల లీకేజీ నేప థ్యంలో పరీక్షను రద్దు చేసిన కమిషన్.. తిరిగి ఆదివారం నిర్వహించనున్నది. ఈ సారి పక్కా గా ఏర్పాట్లు చేసింది. కలెక్టర్లను జిల్లా అథారిటీ ఆఫీసర్లుగా, అడిషనల్ కలెక్టర్లను చీఫ్ కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్లుగా నియమించడంతోపాటు 994 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 994 మంది లైజన్ ఆఫీసర్లు, 310 రూట్ ఆఫీసర్లను నియమించింది.
అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 10.15 గంటల వరకే గ్రూప్-1 పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత గేట్లు మూసేస్తారు. హాల్‌టికెట్లు, ప్రభుత్వం జారీ చేసిన ఐడీ ప్రూఫ్‌ను చెక్ చేస్తారు. మెటల్ డిటెక్టర్‌తో పరిశీలించి లోపలికి పంపుతారు. అభ్యర్థులు షూ ధరిస్తే.. విప్పి లోపలికి వెళ్లాలి. బెల్టు ధరించినా.. తీయించి పరిశీలిస్తారు. ఆ తర్వాత మళ్లీ బెల్టు ధరించొచ్చు. తాళిబొట్టు మినహా ఇతర ఆభరణాలేమైనా ధరిస్తే అక్కడే తీయిస్తారు. ఆ తర్వాత బయోమెట్రిక్ హాజరు తీసుకుని పరీక్ష కేంద్రంలోకి పంపిస్తారు.
బబ్లింగ్ పొరపాట్లతో మొదటికే మోసం
టీఎస్పీఎస్సీ పరీక్షల్లో ఎక్కువ మంది బబ్లింగ్ సమయంలో పొరపాట్లు చేస్తున్నారు. గత ప్రిలిమ్స్‌లోనూ ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సారి బబ్లింగ్‌లో గడుల మధ్య ఖాళీని పెంచి, నమూనా పేపర్‌ను 15 రోజుల ముందుగానే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంచారు. పరీక్ష ఎంత అద్భుతంగా రాసినప్పటికీ బబ్లింగ్‌లో పొరపాట్లు చేస్తే ఆ పేపర్‌ను పరిగణనలోకి తీసుకోరు. ఈ విషయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు కూడా ఉన్నాయి. వివరాలన్నీ నమోదు చేసి, గళ్లలో ఫిల్ చేయకున్నా ఆ పేపర్‌ను వాల్యూయేషన్ చేయరు. ప్రశ్నాపత్రాల రూపకల్పనలో టీఎస్పీఎస్సీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నది. గతంలోని ప్రశ్నలను పక్కన పెట్టడంతోపాటు సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌ను సైతం మార్చింది. ప్రశ్నలను మల్టీ జంబ్లింగ్ చేయనున్నది.
ఈ రూల్స్ మస్ట్..