హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను పలువురు అభ్యర్థులు కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ గాంధీభవన్‌లో గ్రూప్ 1 అభ్యర్థులతో మహేష్‌కుమార్‌గౌడ్ భేటీ అయ్యారు. వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రూప్-1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.
జీవో 29 వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని, జీవో 55 అమలుచేయాలని వారు డిమాండ్ చేశారు. కోర్టు విధివిధానాల మేరకు గ్రూప్-1 పరీక్ష నిర్వహించాలని కోరారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లోనూ తప్పులు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థుల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని మహేశ్‌కుమార్‌గౌడ్ వారికి హామీ ఇచ్చారు.