TGPSC | రాష్ట్రంలోని గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్ణయించాలని ఇప్పటికే టీజీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. కాగా, తాజాగా పరీక్ష సమయంలో మార్పులు చేసింది. గతంలో నిర్ణయించిన సమయం కన్నా అరగంట ముందుగానే పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు మార్పు చేసింది.