హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి గ్రూప్-1 ఉద్యోగ నియామకాల్లో పాటిస్తున్న జీవో-29ని రద్దుచేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశా రు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. జీవో-29 గ్రూప్-1 అభ్యర్థుల పాలిటశాపంగా మారిందని, జీవో-55ను అమలుచేయాలని తాము కోరినా సీఎం రేవంత్‌రెడ్డి పెడచెవినపెట్టారని వాపోయారు. హైడ్రా గురించి మాట్లాడుతున్న సీఎం.. జీవో -29 వల్ల నష్టపోతున్న విద్యార్థుల వైపు ఎందుకు నిలబడటం లేదని ప్రశ్నించారు. కోర్టు తీర్పు వచ్చేవరకు గ్రూప్ -1 మెయిన్స్‌ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ 2.0 ఉద్యమాన్ని మళ్లీ చూడాల్సివస్తుందని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని కాపాడాలని ఒకవైపు రాహుల్‌గాంధీ చెప్తుంటే, రేవంత్ సర్కారు రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతుందని మండిపడ్డారు.