హైదరాబాద్, ఆగస్టు1 (నమస్తే తెలంగాణ): అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టు గండిపై తెలంగాణ, ఏపీతో చర్చించేందుకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 5వ తేదీన సమావేశం నిర్వహించనుంది.
వరద ఉధృతంగా వస్తున్నా సకాలంలో ప్రాజెక్టు గేట్లు తెరవకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే గండి ఏర్పడిందని ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు నిర్ధారించారు. తెలంగాణ ఇరిగేషన్‌శాఖకు రూ.30కోట్ల నష్టం వాటిలినట్టు అంచనా వేశారు.
200 ఎకరాల మేర ఇసుక మేటలు ఏర్పడడంతోపాటు, 16గ్రామాలు ముంపునకుగురై, 90 ట్రాన్స్ఫార్మర్లు, 200 కరెంటు స్తంభాలు ధ్వంసమైనట్లు గుర్తించారు. గోదావరి బేసిన్లో ఏకైక ఉమ్మడి ప్రాజెక్టు ఇదే. అలాగే 6వ తేదీన సమీకృత సీతారామ ప్రాజెక్టు అనుమతుల అంశంపై చర్చించనుంది.