హైదరాబాద్ : గోదావరి నది యాజమాన్య బోర్డు 14వ సమావేశం చైర్మన్ ఎంకే సింగ్ నేతృత్వంలో జలసౌధలో ప్రారంభమైంది. భేటికి తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పీషల్ సీఎస్ రజత్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. గోదావరి నదిపై గూడెం, మోదీకుంట ప్రాజెక్టుల డీపీఆర్‌లు, సీడ్ మని, టెలీమెట్రిల ఏర్పాటు, బోర్డు ఉద్యోగులు తదితర అంశాలపై చర్చించనున్నారు. భేటీకి హాజరైన తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్‌కుమార్ మాట్లాడారు. బోర్డు మీటింగ్‌లో పలు అంశాలపై చర్చ జరుగుతుందన్నారు.
ప్రాజెక్టుల డీపీఆర్‌లు స్టడీ చేస్తారని, ఆంధ్రప్రదేశ్‌తో ఇంటర్ స్టేట్ వివాదాలున్నాయని, వాటిని సీడబ్ల్యూ పరిశీలిస్తుందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ అంగీకరించదని, సహజంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందన్నారు. మోదికుంట వాగు, గూడెం ప్రాజెక్టుల డీపీఆర్‌లు చర్చకు వస్తాయని, టెక్నికల్ క్లియరెన్స్ విషయంలో ఏపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందన్నారు. అయితే, ఇవాళ్టి మీటింగ్‌లో క్లియరెన్స్ వస్తుందని భావిస్తున్నామన్నారు. గోదావరిలో తెలంగాణకు 900 టీఎంసీల వాటా అని.. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని, గోదావరిలో నీటి లభ్యత ఎక్కువ.. 3వేల టీఎంసీల ఎక్సెస్ నీరు తెలిపారు.
ప్రాజెక్టుల ఖర్చు పెరుగుతుందని, తొందరగా క్లియరెన్స్ ఇస్తే పూర్తి చేస్తామన్నారు. గోదావరి టెలీమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని, తమకు ఈ విషయంలో అభ్యంతరం లేదన్నారు. కృష్ణాలో శ్రీశైలం నుంచి దొడ్డి దారిన ఏపీ నీటిని తరలిస్తుందని, అక్కడ కూడా టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ సమస్య మాత్రమే కాదని, పోలవరంపై ఏపీ కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని చూస్తోందన్నారు.
దానిపై బోర్డు దృష్టి పెట్టాలని, ఉన్న పథకాలకు ఇబ్బంది లేకుండా క్లియరెన్స్ ఇస్తే తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పోలవరం బ్యాక్ వాటర్‌పై సర్వే చేయాలని మరోసారి కోరనున్నట్లు తెలిపారు. గోదావరి – కావేరి నదుల నదుల అనుసంధానానికి తాము వ్యతిరేకం కాదని, ఏ రాష్ట్రానికి ఎంత నీరు అవసరం? ఏ రాష్ట్రంలో నీరంత అందుబాటులో ఉంది? అనే విషయాలపై సమగ్రంగా అధ్యయనం జరగాలన్న ఆయన.. ఆ తర్వాత