పరకాల, డిసెంబర్ 7: ఇండ్ల బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి ఆదివారం ప్రచారానికి వచ్చిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని గృహలక్ష్మి లబ్ధిదారులు నిలదీశారు. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్న సమయంలో ఇండ్ల బిల్లులు, రుణమాఫీ కాలేదని నిలదీయడంతో అవాక్కయిన ఎమ్మెల్యే సర్దిచెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు.

ఎమ్మెల్యే సాక్షిగా కాంగ్రెస్ నేతల ఘర్షణ
పర్వతగిరి మండలం మండలం దౌలత్‌నగర్‌లో ప్రచారానికి వచ్చిన ఎ మ్మెల్యే నాగరాజు సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు ప్రచారవాహ నం పైనే ఘర్షణకు దిగారు. టికెట్ కే టాయింపులో తమకు అన్యాయం జ రిగిందంటూ రెబల్‌గా పోటీకి దిగిన అ భ్యర్థి వర్గీయులు ఆరోపించారు. వా హనం పైనే ఘర్షణ జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది, ఎమ్మెల్యే ఏం చేయలేని పరిస్థితిలో తాను ఇక్క డ ఉండలేనంటూ ఎమ్మెల్యే ఆగ్రహం తో వాహనం దిగి వెళ్లిపోవడంతో గొ డవ సద్దుమణిగింది.