హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మంత్రి సీతక్క ఆదేశాలతో 3974 మందికి స్థానచలనం కలగనున్నది. సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పాలనలో పారదర్శకత, ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు 100% ట్రాన్స్ఫర్లకు అనుమతులిచ్చామని సీతక్క వెల్లడించారు. సాధ్యమైనంత తొందరలో పూర్తి చేస్తామని ఆమె పేర్కొన్నారు.