విద్యార్థులు, అధ్యాపకులకు మంత్రి హరీశ్ శుభాకాంక్షలు
హైదరాబాద్, మార్చి 30 : సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అరుదైన గుర్తింపు లభించింది. మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2021-22 విద్యా సంవత్సరానికి నిర్వహించిన పోటీల్లో డిస్ట్రిక్ట్ గ్రీన్ చాంపియన్ సర్టిఫికెట్ దక్కించుకొన్నది. బుధవారం కేంద్ర ప్రభుత్వం మెయిల్ ద్వారా సర్టిఫికెట్‌ను పంపించింది. పారిశుద్ధ్యం, స్వచ్ఛత-పరిశుభ్రత, వ్యర్థాలు, నీటి నిర్వహణ, ఎనర్జీ, గ్రీనరీ మేనేజ్మెంట్ తదితర అంశాల్లో అత్యుత్తమ పద్ధతులు అవలంబించి ఆచరణలో పెట్టినందుకుగాను ఈ సర్టిఫికెట్ లభించింది. డిస్ట్రిక్ట్ గ్రీన్ చాంపియన్ సర్టిఫికెట్ రావడంపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తంచేశారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.