Telangana Secretariat | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రతిష్ఠాత్మక ‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డ్’ దకింది. దేశంలోనే మొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్‌గా రికార్డుల్లోకెకింది. సోమవారం సెక్రటేరియట్లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సభ్యులు అవార్డును రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ప్రదానం చేశారు. అవార్డు రావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగానే అత్యంత విశాలంగా, అధునాతన హంగులతో పర్యావరణహితంగా కొత్త సచివాలయాన్ని నిర్మించినట్టు పేర్కొన్నారు. ఈ క్రెడిట్ అంతా ప్రకృతి ప్రేమికుడైన సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని చెప్పారు.రానున్న రోజుల్లో సోలార్ విద్యుత్తు ప్యానెళ్లు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే ప్లాటినం అవార్డు కూడా గెలుచుకుంటామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అవార్డు వచ్చేలా పని చేసిన ఈఎన్సీ గణపతిరెడ్డి బృందానికి మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్సీ లింగారెడ్డి, ఈఈలు శశిధర్, శ్రీనివాస్, డీఈ దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.