మహబూబ్నగర్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనతో మహబూబ్ నగర్ గులాబీ వనంలా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో ఆయనకు ఘన స్వాగతం పలికాయి. కేసీఆర్ జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్ నినాదాలతో పాలమూరు మారుమోగింది. షాద్నగర్లో పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం స్వీకరించిన కేటీఆర్.. పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ర్యాలీగా ముందుకు కదిలారు.
అనంతరం మహబూబ్ నగర్ MBC గ్రౌండ్లో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లను సన్మానించారు. కాంగ్రెస్ అణివేతను ఎదుర్కొని పోరాడి ఎన్నికల్లో గెలిచినందుకు వారికి అభినందనలు తెలియజేశారు.
Live: మహబూబ్నగర్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఆత్మీయ సమావేశం. https://t.co/mfZVJhruVH
— BRS Party (@BRSparty) January 12, 2026
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS రాకతో
గులాబీ వనంలా మారిన మహబూబ్ నగర్ 🩷🎊భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు 🔥
జై కేసీఆర్ ✊ జై తెలంగాణ ✊
నినాదాలతో మార్మోగుతున్న పాలమూరుకార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన కేటీఆర్
కాసేపట్లో మహబూబ్ నగర్ MBC… pic.twitter.com/6oImXNoWHu
— BRS Party (@BRSparty) January 12, 2026