హైదరాబాద్, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ) : దేశ ఉప ప్రధానిగా డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు. ఆదివారం తెలంగాణభవన్‌లో ఘనంగా జగ్జీవన్‌రామ్ జయంత్యుత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ జగ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేందర్, కిశోర్‌గౌడ్, మహిళా నేతలు సుమిత్రాఆనంద్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, విద్యార్థి నేతలు హరిబాబు, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.
బాబూ జగ్జీవన్‌రామ్ 119వ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘా లు, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ని ర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభు త్వం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు.