హైదరాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): వానకాలం ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్ మొదటివారం నుంచి ప్రారంభించనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో అడిషనల్ కలెక్టర్లు, సివిల్ సైప్లె జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలుకు 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ సీజన్ నుంచే సన్నాలకు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్టు తెలిపారు. డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.