కామారెడ్డి: జిల్లాలో అకాల వర్షానికి పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. సోమవారం రాత్రి గంటసేపు కురిసిన వర్షానికి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. ఇదిలా ఉండగా కామారెడ్డి పట్టణ శివారులో 44వ నెంబరు జాతీయ రహదారి వద్ద పలువురు రైతులు ఆందోళనకు దిగారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ ధాన్యం తడిసిపోయిందని వారు ఆరోపించారు. వారం రోజులుగా ధాన్యం కొనుగోలు చేయలేదని, అందువల్లే ఈ దుస్థితి ఏర్పడిందని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.