ఏప్రిల్ మూడో వారం నుంచిధాన్యం కొనుగోళ్లు!
యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నది. దీనిపై వచ్చే నెల 9 లేదా 10వ తేదీన ముగ్గురు మంత్రుల బృందం సమీక్షించనున్నట్టు తెలిసింది. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఎస్ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంసీహెచ్ఆర్డీలో జరిగే ఈ సమీక్షకు జిల్లా జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ డీఎంలు, ఇతర అధికారులు హాజరుకానున్నారు.
- వచ్చేనెల 10న మంత్రుల బృందం కీలక భేటీ
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నది. దీనిపై వచ్చే నెల 9 లేదా 10వ తేదీన ముగ్గురు మంత్రుల బృందం సమీక్షించనున్నట్టు తెలిసింది. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఎస్ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంసీహెచ్ఆర్డీలో జరిగే ఈ సమీక్షకు జిల్లా జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ డీఎంలు, ఇతర అధికారులు హాజరుకానున్నారు.
ఈ సమీక్షలోనే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి విధి విధానాలను ఖరారుచేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదించనున్నారు. సీఎం అనుమతించగానే కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో 57 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. దీంతో సుమారు 1.30 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని, కనీసం కోటి టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గన్నీ సంచుల సేకరణకు చర్యలు ప్రారంభించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

