అశాస్త్రీయంగా వేతన సవరణ.. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
కనీస వేతనాల సవరణ మరింత శాస్త్రీయంగా రూపొందించాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం అన్‌స్కిల్డ్ కార్మికులకే ప్రయోజనకరంగా ఉందని, సెమీ స్కిల్డ్, హైస్కిల్డ్ కార్మికులకు ఎలాంటి ఉపయోగం ఉండబోదని పేర్కొన్నారు.
- సీఎం రేవంత్‌రెడ్డిని కోరిన సీపీఎం, సీపీఐ ప్రతినిధులు
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): కనీస వేతనాల సవరణ మరింత శాస్త్రీయంగా రూపొందించాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం అన్‌స్కిల్డ్ కార్మికులకే ప్రయోజనకరంగా ఉందని, సెమీ స్కిల్డ్, హైస్కిల్డ్ కార్మికులకు ఎలాంటి ఉపయోగం ఉండబోదని పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో కూనంనేని, జాన్వెస్లీల నేతృత్వంలో వామపక్ష పార్టీల ప్రతినిధులు రేవంత్‌రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఖమ్మం జిల్లా పాతర్లపాడు మాజీ సర్పంచ్, సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావును హత్యచేసి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయకపోవడాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సిట్ ఏర్పాటు చేసి నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని కోరారు.
ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, రైతులు పడుతున్న ఇబ్బందులు, వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగాల భర్తీ, ఫ్యూచర్ సిటీ భూ సేకరణలో దళితులకు అన్యాయం జరుగకుండా పరిహారం ఇవ్వాలని, రామోజీ ఫిల్మ్‌సిటీ పరిధిలో పేదలకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అప్పగించాలని సీపీఎం కార్యదర్శి జాన్‌వెస్లీ కోరారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పోరాటాలు కొనసాగిస్తామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు వారు వెల్లడించారు. రేవంత్‌ను కలిసిన వారిలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీ సాగర్, మల్లు లక్ష్మి, సీపీఐ ప్రతినిధులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, చాడ వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, ఈటీ నరసింహ, భాగం హేమంతరావు, కలవేణ శంకర్, ఎం.బాలనరసింహ, వీఎస్ బోస్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

