మహబూబాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనేవారు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకాకపోవడంతో అగ్గువ సగ్గువకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 1,83,210 ఎకరాల్లో వరి సాగు చేశారు. 2,88,782 టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 226 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కోతలు గత నెలలోనే మొదలయ్యాయి. ఈ సారి ధాన్యానికి గ్రేడ్-ఏ రకానికి రూ.2,320, గ్రేడ్- బీ రకానికి రూ.2,300 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది.
ఇది కాకుండా సన్న వడ్లకు అదనంగా రూ.500 ఇస్తామని ప్రకటించింది. ప్రకటనల వరకు బాగానే ఉన్నా అమలులోకి వచ్చేసరికి రైతులకు చుకలు చూపిస్తున్నారు. 226 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పి, జిల్లాలో అకడకడ కొన్ని ప్రారంభించారు. ప్రారంభించిన వాటిలో కూడా ఇంకా కొనడం లేదు. వరి కోసిన రైతులు ఏమి చేయాలో తెలియక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. ఫలితంగా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ రైతులకు దకకుండాపోతుంది. జిల్లాలో అకడకడ ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో కూడా అధికారులు తేమ పేరిట వడ్ల కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. రైతు లు దికుతోచని స్థితిలో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
ప్రైవేటు వ్యాపారికే అమ్ముకున్న
నాకున్న వ్యవసాయ భూమితోపాటు కౌలుకు తీసుకొని వరి వేసిన. భారీ వర్షాలతో సగం నష్టపోయా. ఇప్పటివరకు మా మండలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాకు రూ. 2150 చొప్పున అమ్ముకున్నం. ప్రభుత్వం క్వింటాకు రూ.2,320 మద్దతు ధర చెల్లించడంతోపాటు సన్న వడ్లకు బోనస్ రూ.500 ఇస్తమన్నది. కొనుగోలు కేంద్రాలే ఏర్పాటు చేయకపోవడంతో చాలా నష్టపోయా. క్వింటాకు రూ. 500 బోనస్ లేకపోగా, అసలు మద్దతు ధరలో రూ.150కి తకువగా అమ్ముకున్న.
– డొనికెన సోమన్న, రైతు, కొమ్ములవంచ