ప్రభుత్వ బడులకు మహర్దశ పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో అరకొర వసతులు, శిథిల భవనాల్లో చదువులు సాగాయి. బీఆర్ఎస్ సర్కారు వచ్చాక ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నది. భవనాలకు మరమ్మతులు చేపట్టి సరికొత్తగా తీర్చిదిద్దింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది. స్కూళ్లలో చేరుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు నుంచి తీసుకొచ్చి సర్కారు బడుల్లో చేర్పిస్తున్నారు. పేద, మధ్య తరగతి వారు ప్రైవేటులో ఫీజులు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారందరికీ ప్రభుత్వ పాఠశాలలు ఎంతో ఉపయోగంగా మారాయి.
-బ్లెస్సీ డేవిడ్, మల్లేపల్లి
నగరానికి మణిహారం ఐటీ కారిడార్
తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్ అభివృద్ధి ఊపందుకున్నది. 60 ఏండ్లుగా వలస పాలనలో ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్న తెలంగాణ కేవలం 10 సంవత్సరాల్లోనే ప్రపంచస్థాయి నగరాలతో పోటీ పడుతున్నది. ఇందుకు సీఎం కేసీఆర్ దూరదృష్టి ప్రణాళికలే కారణం. మహానగరానికి ఐటీ పార్కులు మణిహారంలా మెరుస్తున్నాయి. నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది యువత ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా కూడా హైదరాబాద్‌కు గుర్తింపు దక్కింది. పచ్చదనం పరిరక్షణలో అన్ని రాష్ర్టాల కంటే ముందు వరుసలో ఉన్నది. పారిశుధ్య నిర్వహణలో కేంద్ర ప్రభుత్వమే అనేక అవార్డులు అందజేసిన చరిత్ర తెలంగాణ సొంతం.
-రణం శ్రీనివాస్‌గౌడ్,