హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులకు ప్రభుత్వం రూ. 358 కోట్ల దీపావళి బోనస్ ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు కార్మికుల ఖాతా ల్లో బోనస్ అమౌంట్ జమయ్యేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ బలరామ్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో సింగరేణి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బోనస్ వివరాలను మీడియాకు వెల్లడించారు. 42 వేల మందికి రూ. 93,750 చొప్పున చెల్లించనున్నారు. దీపావళి బోనస్ 350 కోట్లను విడుదల చేయాలని ప ర్సనల్, ఫైనాన్స్ విభాగం అధికారుల ను ఆదేశించామని సీఎండీ వెల్లడించా రు. కోల్ ఇండియాతో జరిగిన చర్చ ల్లో ఈ ఏడాది కార్మికులకు లక్ష బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. రూ. 375 కోట్లు అవసరమని చెప్పాయి. లక్ష దీపావళి బోనస్ ఇప్పిస్తామని కార్మిక సంఘాలు హామీ ఇచ్చాయి. కానీ ఆ హామీ నెరవేరకపోవడంతో కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.