TG Transco : విద్యుత్ ట్రాన్స్మిషన్ సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోంది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గుతున్న కాంగ్రెస్ సర్కార్ ట్రాన్స్‌కోలో 26 శాతం వాటాను విక్రయించేందుకు వేగంగా ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణ విద్యుత్ ట్రాన్స్మిషన్ సంస్థ(ట్రాన్స్‌కో)లో ప్రభుత్వానికి ఉన్న 100 శాతం వాటాలో 26 శాతం విక్రయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)ను సిద్ధం చేసి, తమ సంస్థ ఆర్థిక పరిస్థితిని, డబ్బు ఎందుకు అవసరం? అనే అంశాలను సెబీకి తెలియజేయనుంది ట్రాన్స్‌కో.
కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్లతో తెలంగాణ ట్రాన్స్‌కోను ప్రైవేట్ పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంస్థలోని 26 శాతం వాటా విక్రయం కోసం సెబీకి .. డీఆర్‌హెచ్‌పీను పంపించనుంది. సెబీ ఆమోదం తెలిపిన అనంతరం, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో)కు వెళ్లి, స్టాక్ మార్కెట్ ద్వారా తమ షేర్లను ప్రజలకు ట్రాన్స్‌కో సంస్థ విక్రయించనుంది. మలి విడతలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అనంతరం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రాన్స్‌కో నమోదు కానుంది. ఈ ప్రక్రియ కోసం ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ అనే సంస్థను కన్సల్టెన్సీగా నియమించాలని తెలంగాణ పవర్ కో–ఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది.
ట్రాన్స్‌కోలో ఇతర సంస్థలకు భాగస్వామ్యం ఇవ్వాలని కేంద్రం కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలోనే వాటా విక్రయిస్తున్నారా? అనే అంశంపై నిపుణులు చర్చిస్తున్నారు. అదేజరిగితే.. ఐపీవోకు వెళ్లనున్న సంస్థల జాబితాలో ట్రాన్స్‌కో మొదటి వరుసలో నిలవనుంది. అయితే ఈ అంశం బయటికి రాకుండా ట్రాన్స్‌కో ఉద్యోగులు అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడకూడదని, మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ట్రాన్స్‌కో డైరెక్టర్ ఓరుగంటి శ్రీనివాసులు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం.
అమ్మకానికి తెలంగాణ ట్రాన్స్‌కో..!!
విద్యుత్ ట్రాన్స్మిషన్ సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు తొలి అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ట్రాన్స్‌కోలో 26% వాటాను విక్రయించేందుకు వేగంగా ప్రణాళికలు
కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ విద్యుత్ ట్రాన్స్… https://t.co/BMbXBvtt6Y pic.twitter.com/wN1nyUjeAv
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2026