Special Officers | తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా సీ హరికిరణ్, కరీంనగర్ ప్రత్యేక అధికారిగా సర్ఫరాజ్ అహ్మద్, నిజామాబాద్ ప్రత్యేక అధికారిగా ఆర్ హన్మంతు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రత్యేకాధికారిగా డీ దివ్యను నియమించింది. మహబూబ్నగర్ ప్రత్యేక అధికారిగా రవి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారిగా శశాంక, మెదక్ జిల్లా ప్రత్యేక అధికారిగా ఏ శరత్, ఖమ్మం ప్రత్యేకాధికారిగా కే సురేంద్రన్, హైదరాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా ఇలంబర్తికి బాధ్యతలు అప్పగించింది.