హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా 3 లక్షల మంది పెన్షనర్ల ను, వారి కుటుంబ సభ్యులను తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ శుభాకర్‌రావు సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖజానా ఖాళీ అని చెప్పి.. పెన్షనర్లు , ఉద్యోగులకు ఎగ్గొట్టి ఉచితాలకు, వృథా తిరుగుళ్లకు, మూసీ ప్రక్షాళనకు, హైడ్రాకు వేలాది కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నారని ప్రశ్నించారు. స్పెషల్ టీచర్లుగా సేవలందించిన కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లువ్వాలని, పెన్ష నర్ల సమస్య పరిష్కారానికి పెన్షనర్ల సంఘాలతో చర్చించి పరిష్కారించా లని డిమాండ్ చేశారు.