హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : దేవాదయ శాఖలో ధార్మిక సలహాదారుగా ఆర్ గోవింద హరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోవింద హరికి దేవాదయ శాఖలో ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, ఎండోమెంట్స్ కార్యకలాపాల నిర్వహణలో సంబంధిత శాఖకు సరైన సలహాలు ఇవ్వడానికి ఈ నియామకం చేపట్టినట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. మూడేండ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఆయనకు నెలవారీ వేతనంతోపాటు ఎండోమెంట్ ఆఫీసులో వసతి కల్పించనున్నారు.