కోర్టు విచారణ ఉంటే బిల్లులపై కదలిక
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ తమిళసై వింత వైఖరి అవలంబిస్తున్నారు. కోర్టు కేసు విచారణకు వచ్చిన సమయంలో మాత్రమే బిల్లులపై హడావుడిగా నిర్ణయం తీసుకొంటున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్న నేపథ్యంలో ఓ బిల్లును తిరస్కరిస్తూ, మరో రెండు బిల్లులపై వివరణ కోరుతూ తిప్పి పంపారు.
- గవర్నర్ తమిళి సై వింత వైఖరి
- పది బిల్లులపై నెలలుగా పెండింగ్
- సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర సర్కారు
- విచారణ రోజే 3 బిల్లులకు ఆమోదం
- తాజాగా మూడు బిల్లులపై నిర్ణయం
- గవర్నర్ తీరుపై మేధావుల మండిపాటు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ తమిళసై వింత వైఖరి అవలంబిస్తున్నారు. కోర్టు కేసు విచారణకు వచ్చిన సమయంలో మాత్రమే బిల్లులపై హడావుడిగా నిర్ణయం తీసుకొంటున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్న నేపథ్యంలో ఓ బిల్లును తిరస్కరిస్తూ, మరో రెండు బిల్లులపై వివరణ కోరుతూ తిప్పి పంపారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన మొత్తం 10 బిల్లులపై గవర్నర్ తమిళిసై కొన్ని నెలలుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టారు. కనీసం కారణం కూడా చెప్పలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గత నెల 2న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 10న విచారణ జరిగింది. అప్పటివరకూ బిల్లులను పెండింగ్ పెట్టిన గవర్నర్.. విచారణ రోజే మూడు బిల్లులను ఆమోదించారు. రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపించారు. మరో రెండు బిల్లులకు సంబంధించి వివరణ కోరుతూ తిప్పి పంపారు. మిగతా మూడు బిల్లులను మళ్లీ పెండింగ్లో పెట్టారు.
ఇందులో ముఖ్యమైన ది తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్ట సవరణ బిల్లు-2022, ది తెలంగాణ మున్సిపల్ లాస్ సవరణ బిల్లు-2022 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం మరోసారి విచారణ జరిగింది. దీంతో గవర్నర్ మరోసారి హడావుడిగా నిర్ణయాలు తీసుకొన్నారు. డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) సహా వైద్య విద్యలో పాలనాపరమైన పోస్టుల పదవీ విరమణ వయస్సు పెంపునకు ఉద్దేశించిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లును తమిళి సై తిరస్కరించారు. పురపాలికల్లో అవిశ్వాస తీర్మానం గడువును మూడు నుంచి నాలుగేళ్లకు పొడిగింపు, కో ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపునకు ఉద్దేశించిన పురపాలిక చట్ట సవరణ బిల్లు, కొత్తగా మరికొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతిస్తూ తీసుకొచ్చిన ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులపై వివరణ కోరుతూ ప్రభుత్వానికి తిప్పి పంపారు. సోమవారం సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందువల్లే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకొన్నారన్నది బహిరంగ రహస్యమే. రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా భావించిన నాలుగు బిల్లులను తిప్పి పంపడమంటే ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకొని, ప్రజలకు మేలు కలుగకుండా చూడటమేనని మేధావులు మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

