హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : గవర్నర్‌కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కేసు తదుపరి విచారణను మార్చి 20కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్‌ను, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణను ఎమ్మెల్సీగా నాటి కేసీఆర్ మంత్రివర్గం ఆమోదించింది. అయితే, వీరి నియామకాన్ని అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు. కేసీఆర్ మంత్రిమండలి రెండుసార్లు ఆమోదించి పంపినా గవర్నర్ వాటిని ఆమోదించకపోవడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేసింది. వాదనలు విన్న అనంతరం కే సు తదుపరి విచారణను మార్చి 20కి వాయిదా వేసింది.