హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వర్సిటీల్లో క్రీడలను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వైస్ చాన్స్లర్లకు సూచించారు. సోమవారం రాజ్‌భవన్‌లో పలు వర్సిటీల వీసీలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఒలింపిక్స్, నేషనల్ గేమ్స్, పారా ఒలింపిక్స్‌లోనూ తెలంగాణ విద్యార్థులు సత్తాచాటుతున్నారని తెలిపారు. ఉన్నత విద్యాసంస్థలు జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌తోపాటు న్యాక్ గుర్తింపును పొందేలా చొరవ తీసుకోవాలని కోరారు.
వర్సిటీలను స్కిల్ డెవలప్మెంట్, ప్లేస్మెంట్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్లుగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలు వర్సిటీల వీసీలు ప్రొఫెసర్ కిషన్‌రావు, ప్రొఫెసర్ సీతారామారావు, ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ కవిత దర్యానిరావు, ప్రొఫెసర్ లక్ష్మీకాంత్‌రాథోడ్ సహా రిజిస్ట్రార్లు, రెడ్‌క్రాస్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.