 
                                                            
భువనగిరి: ఐరన్ మాత్రలపై గర్భిణులకు అవగాహన కల్పించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) సూచించారు. పిల్లలు నల్లగా పుడతారని ఐరన్ మందులను వేసుకోకుండా పడేస్తున్నారని చెప్పారు. గర్భిణిలు ఐరన్ గోళీలు వేసుకోవాలని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ దవాఖానలో 2021- 2022 బ్యాచ్ విద్యార్థులు కోర్సులో చేరుతున్న సందర్భంగా నిర్వహించిన వైట్కోట్ వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందుబాటులోకి రావాలన్నారు. వైద్య వృత్తిని ఆస్వాదిస్తూ నేర్చుకోవాలని సూచించారు. వైద్యవిద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు.
 
                            