Medaram Jathara | తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలక్క జాతర ఘనంగా జరుగుతోంది (Medaram Jathara ). ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చారు. జాతర నేపథ్యంలో అడవి అంతా భక్తజన సందోహంతో నిండిపోయింది. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు మేడారం చేరుకొని వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Tamilisai Soundararajan) కూడా వనదేవతలను దర్శించుకొని బంగారం సమర్పించారు.
శుక్రవారం ఉదయం 11:05 గంటలకు హెలికాప్టర్ ద్వారా కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, గవర్నర్ తమిళిసై మేడారం చేరుకున్నారు. వీరికి మంత్రి సీతక్క (Minister Seethakka), ఈటెల రాజేందర్, జిల్లా కలెర్టర్ ఇలా త్రిపాఠి తదితర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం వనదేవతల దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ అక్కడ బంగారం సమర్పించారు.
Also Read..
Bheema Movie | గోపీచంద్ ‘భీమా’ ట్రైలర్ టైం ఫిక్స్.. ఎప్పుడంటే.?
Haryana police | రైతులు తమపై కారం పొడితో దాడి చేశారు.. పంజాబ్ పోలీసుల ఆరోపణలు
Tantra Movie | పిల్లబచ్చాలు ఈ సినిమాకు రావోద్దు.. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘తంత్ర’