Tantra Movie | ‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్’ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనన్య నాగళ్ల. అయితే ఇన్ని రోజులు గ్లామరస్, కూల్ క్యారెక్టర్స్ చేసిన ఈమె ఇప్పుడు హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘తంత్ర’. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా.. ఫస్ట్ కాపీ మూవీస్ ప్రొడక్షన్ పై నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో తెలుపుతూ.. ‘తంత్ర’ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పిల్లబచ్చాలు ఈ సినిమాకు రావోద్దు. ఎందుకంటే మాది ఏ సర్టిఫికెట్ సినిమా అంటూ చిత్రబృందం రాసుకోచ్చింది. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్, దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ హీరోగా పరిచయమవుతున్నాడు. మరో కీలక పాత్రలో ‘మర్యాదరామన్న’ ఫేం సలోని ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది.
#Tantra Releasing On March 15 pic.twitter.com/5GvpTXd4Yk
— Vamsi Kaka (@vamsikaka) February 23, 2024