హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. ఆయన తొలిసారి ప్రధాని, రాష్ట్రపతిలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన శివప్రతాప్ శుక్లా మార్చి 11న రాష్ట్ర ఐదో గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.