వైభవంగా ఘటాల ఊరేగింపు
చారిత్రాత్మకమైన లాల్‌దర్వాజ సింహ వాహిని శ్రీ మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలు ముగింపు సందర్భంగా సోమవారం అమ్మవారి ఘటాల, అంబారీ ఊరేగింపు అత్యంత వైభవంగా కొనసాగింది. ప్రధాన ఊరేగింపు మార్గం జనసంద్రంగా మారింది. ఫలహారం బండ్లకు పొట్టేలను కట్టి ఊరేగించడం విశేషంగా ఆకట్టుకుంది.
చాంద్రాయణగుట్ట,ఆగస్టు 10: చారిత్రాత్మకమైన లాల్‌దర్వాజ సింహ వాహిని శ్రీ మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలు ముగింపు సందర్భంగా సోమవారం అమ్మవారి ఘటాల, అంబారీ ఊరేగింపు అత్యంత వైభవంగా కొనసాగింది. ప్రధాన ఊరేగింపు మార్గం జనసంద్రంగా మారింది. ఫలహారం బండ్లకు పొట్టేలను కట్టి ఊరేగించడం విశేషంగా ఆకట్టుకుంది. లాల్‌దర్వాజ అధికారిక పోతరాజు అశ్విన్ ముదిరాజ్ భక్తులను అలరించారు. దేవతమూర్తుల వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఊరేగింపునకు మరింత శోభ తీసుకొచ్చాయి. లాల్‌దర్వాజ ఆలయం వద్ద పచ్చికుండపై నిల్చొన్ని మాతంగి అనురాధ రంగం (భవిష్యవాణి)వినిపించారు. ప్రజలు చేసే పూజలతోనే దేశం సుభిక్షంగా ఉందన్నారు.
లాల్‌దర్వాజ ఆలయ విస్తరణ పనులు చేపట్టాలన్నారు.గ్రామ గ్రామన తను కొలువుదీరి ఉన్నానని,అందుకే తనతో పాటు ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.కాలికాలం కావడంతో అనుకొని సంఘటనలు జరుగుతున్నాయని,పసి పిల్లలపై ఘోరాలు పెరిగిపోతున్నాయన్నారు. ఉప్పుగూడ, ఛత్రినాక, గౌలిపుర,లాల్‌దర్వాజ మోడ్ మీదుగా చార్మినార్, నయాపూల్ ఢిల్లీ దర్వాజ వరకు ఊరేగింపు వేడుకలు నిర్వహించారు. ఉప్పుగూడలో టిల్లు తల్వార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫలహారం బండిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించుకోవడం జరిగిందన్నారు.





Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eligible Graduate | అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ఎంజీయూ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆర్థిక సాయం
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
Srinivas Goud | ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

