హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలువాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి శుక్రవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఏరోస్పేస్, డిఫెన్స్, మారిటైమ్, ఫిక్టెక్, ైక్లెమేట్ గవర్నెన్స్, లైఫ్‌సైన్సెస్, ఫుడ్ టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టామని బాలకిష్టారెడ్డి గవర్నర్‌కు వివరించారు. ఈ కోర్సులను సమర్థవంతంగా అమలుచేయాలని గవర్నర్ సూచించారు.