హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. దసరా పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని సూచించారు. విజయదశమి సమస్త విజయాలకు సంకేతమని, చేపట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు.