యాదాద్రి భువనగిరి : జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnudev Varma)కొలనుపాక జైన దేవాలయాన్ని(Jain temple) సందర్శించారు. గవర్నర్కు ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యుడు బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర స్వాగతం పలికారు.
అనంతరం కొలనుపాకలో(Kolanupaka) శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని, అభిషేక పూజలో పాల్గొన్నారు. వేద పండితులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో గవర్నర్ కు స్వాగతం పలికారు. తొలుత దేవాలయం ముందు బతుకమ్మలు, బోనాలు, కోలాటలతో మహిళలు స్వాగతం పలికారు.