యాదగిరిగుట్ట : యాదాద్రి( Yadadri temple )ఓ అద్భుతం.. ఇక్కడికి మళ్లీ తప్పకుండా వస్తానని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ (Governor Jishnu Dev Varma) అన్నారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీ నరసిం హస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. తర్వాత గవర్నర్‌కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాఉతూ..ఈ ఆలయంలో నేను మంచి అనుభవాన్ని పొందాను.. మళ్లీ తప్ప కుండా వచ్చి దర్శించుకుంటానని తెలిపారు. ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. కాగా, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. రోడ్డు మార్గాన యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయన లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.
అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 11.30 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో 25 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన రచయితలు, కళాకారులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వెంకటా పూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి చేరుకొని పూజ లు నిర్వహించిన అనంతరం సరస్సును సందర్శించనున్నారు.
యాదాద్రి ఓ అద్భుతం.. ఇక్కడికి మళ్లీ తప్పకుండా వస్తాను
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ గవర్నర్
ఈ ఆలయంలో నేను మంచి అనుభవాన్ని పొందాను.. మళ్లీ తప్పకుండా వచ్చి దర్శించుకుంటాను – తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ pic.twitter.com/utcI4uTiLx
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2024