ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కొవిడ్ బారిన పడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మహబూబ్నగర్ : కొవిడ్ బారిన పడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎస్వీఎస్ దవాఖాన కొవిడ్ వార్డును సందర్శించి వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న బాధితులతో నేరుగా మాట్లాడి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఐసీయూను సందర్శించి ఐసీయూలో ఉన్న రోగులతో మాట్లాదారు.
అనంతరం ఫార్మసీలో అందుబాటులో ఉన్న రెమిడిసివిర్, ఇతర కొవిడ్ మందుల స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు అతి తక్కువ ధరలకే చికిత్స అందిస్తున్న ఎస్వీఎస్ దవాఖాన సేవలు అభినందనీయమని మంత్రి అన్నారు. పేదలకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు కేవలం రూ. 1999కే రూపాయలకే సిటీ స్కాన్ చేసేలా ప్రైవేటు డయోగ్నోస్టిక్ సెంటర్లను ఒప్పించామని మంత్రి తెలిపారు.

ఫిల్మ్ తో పాటు ఇవ్వటం, అంతేకాక 30 వేల రూపాయలు, అంతకంటే తక్కువకే కొవిడ్ రోగులకు వారం రోజులపాటు చికిత్స అందించడంలో జిల్లాలో ఎస్వీఎస్ దవాఖాన ముందుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ జనరల్ దవాఖానలో మరో 250 ఆక్సిజన్ పడకలు త్వరలో ప్రారంభించబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లా ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే అన్ని సేవలను పొందవచ్చుని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
జిల్లాలో ఫీవర్ సర్వే కొనసాగుతున్నదని, ఇప్పటివరకు కొవిడ్ లక్షణాలున్న 11000 మందికి కిట్లను పంపిణీ చేసినట్లు వివరాలను వెల్లడించారు.
జిల్లాలో 6 ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటితోపాటు సంచార అంబులెన్సుల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్వీఎస్ హాస్పిటల్ డైరెక్టర్ రామిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
చెరువులో విష ప్రయోగం..చేపలు మృతి
మెడికల్ హబ్గా వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్
దాతృత్వం స్ఫూర్తి దాయకం : మంత్రి జగదీష్ రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

