e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం

తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం

తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం

సూర్యాపేట : ఆంధ్రా-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లను ఈ రోజు జిల్లా ఎస్పీ ఆర్‌. భాస్కరన్ తనిఖీ చేశారు. ఈ సందదర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆంధ్రా నుంచి తెలంగాణలోకి వచ్చే వారికి e-పాస్ అనుమతి తప్పనిసరి అన్నారు. ఉ.6 గంటల నుంచి ఉ.10 గంటల సమయంలో కూడా e-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ లకు అనుమతులు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు.


అలాగే మేల్లచెరువు, చితలపాలెం, మఠంపల్లి, పాలకవీడు మండలాల్లో ఉన్న ఆంధ్ర-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దుల్లో అత్యవసర సేవలు మినహాయించి ఇతర అన్ని సాధారణ రాకపోకలను 24 గంటలు నిషేధించామని పేర్కొన్నారు. కొంత మంది వాహనదారులు, ప్రజలు లాక్‌ డౌన్‌ మినహాయింపు సమయాన్ని ఆసరాగా చేసుకుని అనవసరంగా సరిహద్దులు దాటుతున్నారు.


అలాగే ఆంధ్రా నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఉదయం 4 నుంచి 6 గంటలోపు రామాపురం x రోడ్డు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ కు చేరుకుని అక్కడే 6 గంటల వరకు వేచి ఉండి మినహాయింపు సమయంలో తెలంగాణలోకి వస్తున్నారు.

ఈ కారణం చేత వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఆంక్షలను కఠినతరం చేశామని ఎస్పీ తెలిపారు. తెలంగాణాలోకి రావాలంటే ఏ సమయంలోనైనా ఈ-పాస్ ఉండాలన్నారు. దీనిని ప్రజలు గమనించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి..

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

నేత్రపర్వంగా వాసవి జయంతి

నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం

ట్రెండింగ్‌

Advertisement