హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఉప్పల్ భగాయత్ లో అగర్వాల్ సమాజ్ ఆత్మగౌరవ భవనానికి బుధవారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
దేశవ్యాప్తంగా విద్యుత్, తాగునీరు, శాంతి భద్రతల సమస్య ఉందని తెలంగాణలో మాత్రం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. హైదరాబాద్ రహదారులకు రోడ్ల కనెక్టవిటీని పెంచామని తెలిపారు. అగర్వాల్ సమాజ్ సభ్యులు వ్యాపారపరంగా దేశవ్యాప్తంగా తిరుగుతారని అక్కడి పరిస్థితులు తెలంగాణలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు.
అన్ని సామాజిక వర్గాల ఆత్మగౌరవం పెంపొందించేందుకు భవనాల నిర్మాణం చేపడుతుందని తెలిపారు. అగర్వాల్ సమాజ్ భవనం కోసం కోట్లాది రూపాయల విలువ చేసే 3 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని వివరించారు. అగర్వాల్ సమాజ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.